Saaho Movie: ‘సాహో’ స్టోరీ లీక్.. ప్రభాస్ ‘డబుల్’ రోల్!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో నిర్మితమైన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు సాంగ్స్ ప్రోమోస్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఇదే ‘సాహో’ సినిమా కథంటూ ఓ స్టోరీలైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కథ ప్రధానంగా రెండు వేల కోట్ల దొంగతనం చుట్టూ నడుస్తుంది. ఆ దొంగతనం ఎవరు […]
![Saaho Movie: 'సాహో' స్టోరీ లీక్.. ప్రభాస్ 'డబుల్' రోల్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2019/08/saaho-7.jpg?w=1280)
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో నిర్మితమైన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు సాంగ్స్ ప్రోమోస్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఇదే ‘సాహో’ సినిమా కథంటూ ఓ స్టోరీలైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమా కథ ప్రధానంగా రెండు వేల కోట్ల దొంగతనం చుట్టూ నడుస్తుంది. ఆ దొంగతనం ఎవరు చేశారనేది పోలీసులకు ఓ మిస్టరీగా మారుతుంది. ఇక ఈ కేసును టేక్ అప్ చేయడానికి అశోక్ చక్రవర్తి(ప్రభాస్) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగతనం చేసేది కూడా ప్రభాసే. ఓ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అన్ని వేల కోట్లు దొంగతనం చేయాల్సి వచ్చిందనేది ఫ్లాష్‌బ్యాక్‌లో దర్శకుడు చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తాడు. ఇక ప్రభాస్ సంగతి తెలిసి హీరోయిన్ మొదట్లో అపార్ధం చేసుకున్నా.. తర్వాత ప్రేమిస్తుందట.
ఇకపోతే ప్రభాస్ తండ్రి ఓ శాస్త్రవేత్త.. ఒక అధునాతన జెట్ ప్యాక్‌ను సృష్టిస్తాడు. దానికి సంబంధించిన రహస్యాలు ఓ బ్లాక్ బాక్స్‌లో ఉంటాయి. అసలు ఆ బ్లాక్ బాక్స్‌కు.. రెండు వేల కోట్ల దొంగతనానికి మధ్య సంబంధం ఏమిటి అనేది మిగతా స్టోరీ అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడనే టాక్ కూడా నడుస్తోంది. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో ప్రక్కన పెడితే.. ‘సాహో’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.