నేనెప్పటికీ గులాబీ సైనికుడినే: ఈటల

తానెప్పటికీ గులాబీ సైనికుడినేనని, మా నాయకుడు కేసీఆరేనని మంత్రి ఈటల అన్నారు. అంతకుముందు హుజురాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. తాను పార్టీలో చేరినప్పటి నుంచి నేటి వరకు గులాబీ సైనికుడినే అన్నారు. తనపై నిరాధార ఆరోపణలు వద్దని, తన వ్యాఖ్యల వక్రీకరణ సరికాదని హితవు పలికారు. తన ఎదుగుదల ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు వార్తలతో అవమనించాలని చూడొద్దని, నిరాధారమైన వార్తలు వద్దని సూచించారు. సోషల్‌మీడియా సంయమనంతో ఉండాలన్నారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:14 pm, Thu, 29 August 19
నేనెప్పటికీ గులాబీ సైనికుడినే: ఈటల

తానెప్పటికీ గులాబీ సైనికుడినేనని, మా నాయకుడు కేసీఆరేనని మంత్రి ఈటల అన్నారు. అంతకుముందు హుజురాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. తాను పార్టీలో చేరినప్పటి నుంచి నేటి వరకు గులాబీ సైనికుడినే అన్నారు. తనపై నిరాధార ఆరోపణలు వద్దని, తన వ్యాఖ్యల వక్రీకరణ సరికాదని హితవు పలికారు. తన ఎదుగుదల ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు వార్తలతో అవమనించాలని చూడొద్దని, నిరాధారమైన వార్తలు వద్దని సూచించారు. సోషల్‌మీడియా సంయమనంతో ఉండాలన్నారు. తన ప్రసంగం పూర్తి పాఠం చదవాలని హితవు పలికారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస ఏకపక్షంగా గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

ఇటీవల తనపై కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. తనపై వచ్చిన వార్తల పట్ల కలత చెందిన రాజేందర్‌ గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు.  తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. 15 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచి 5 రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఈటల అన్నారు. మంత్రి పదవి బిక్ష కాదని… తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని… ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని వ్యాఖ్యానించారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని అన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్నీ కాదని,.బతికొచ్చినోన్నీ కాదని ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్ళం కాదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని ఈటల తెలిపారు. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని ఈటల అన్నారు.