సాహో క్లోజింగ్ కలెక్షన్స్… చూస్తే షాక్ అవ్వాల్సిందే!
‘బాహుబలి 1&2’ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందరూ అనుకున్నట్లుగానే అంచనాలకు తగ్గట్టుగా ‘సాహో’ అన్ని భాషల్లోనూ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ స్టార్ ఇమేజ్‌తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. ఈ […]

‘బాహుబలి 1&2’ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందరూ అనుకున్నట్లుగానే అంచనాలకు తగ్గట్టుగా ‘సాహో’ అన్ని భాషల్లోనూ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ప్రభాస్ స్టార్ ఇమేజ్‌తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో సాహో నాలుగు వారాలకు గానూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 84 కోట్ల షేర్ సాధించినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఏరియాల వారీగా చూస్తే…
నైజాం – రూ.30 కోట్ల
సీడెడ్ – రూ.12 కోట్ల
ఉత్తరాంధ్ర – రూ.11 కోట్ల
తూర్పు గోదావరి – రూ.7.5 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ.6 కోట్లు
గుంటూరు – రూ.8 కోట్ల
కృష్ణా – రూ.5.5 కోట్లు
నెల్లూరు – రూ.4.5 కోట్లు
ఇక సౌత్ విషయానికి వస్తే.. కర్ణాటకలో ఈ సినిమా రూ.16.5 కోట్లు కొల్లగొట్టగా.. తమిళ వెర్షన్ రూ.5.50 కోట్లు, మలయాళంలో రూ.1.50 కోట్లు సాధించింది. దక్షిణాదిన దాదాపు ఈ సినిమా రిలీజ్ చేసిన వారందరికీ భారీగా నష్టాలు కలిగాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంటరెస్టింగ్ విషయం ఒకటుంది. అదేంటంటే ఈ సినిమాకి నార్త్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం విశేషం. మొత్తంగా అక్కడ రూ.157 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ విషయానికొస్తే..అమెరికాలో రూ.14 కోట్లు, మిగతా దేశాల్లోరూ.18 కోట్లు వసూలు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.220 కోట్ల షేర్‌ను.. రూ.420 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో దాదాపు రూ.50 కోట్ల మేరకు నష్టాలు మిగిల్చింది. తెలుగులో మాత్రం 120 కోట్ల బిజినెస్ చేస్తే.. 80 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. హిందీలో రూ.100 కోట్ల బిజినెస్ చేస్తే.. రూ.150 కోట్లకు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే ఒక్క బాలీవుడ్ మాత్రమే ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.