Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా జనం మెచ్చినా తానూ మాత్రం ఒప్పనంటున్నాడు.. గెలుపు అంగీకరించమంటున్న రష్యా..

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. కానీ..

అమెరికా జనం మెచ్చినా తానూ మాత్రం ఒప్పనంటున్నాడు.. గెలుపు అంగీకరించమంటున్న రష్యా..
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 23, 2020 | 5:14 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. కానీ, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును మాత్రం తాము గుర్తించేందుకు సిద్ధంగా లేనని పుతిన్‌ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజల నమ్మకాన్ని కలిగిన ఏ నాయకుడితోనైనా మేము కలిసి పనిచేస్తాం. అయితే, ఆ విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు నిర్ధారించబడిన తర్వాతే ఆ గౌరవం ఉంటుందనిరష్యన్‌ అధికారిక మీడియాలో పుతిన్‌ వెల్లడించారు. బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్‌ నిర్ణయం తీసుకుందని.. వీటిలో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్‌ వివరణ ఇచ్చారు. అయితే, ఈ చర్య అమెరికా-రష్యా సంబంధాలను దెబ్బతీస్తుందా? అన్న ప్రశ్నకు బదులుగా.. ‘దెబ్బతినడానికి ఏమీ లేవు, అవి ఇప్పటికే పూర్తిగా క్షీణించిపోయాయి’ అని పుతిన్‌ సమాధానమిచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రపంచ దేశాధినేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం, రష్యా, చైనా వంటి దేశాలు మాత్రమే ఆచితూచి స్పందించాయి. చివరకు చైనా కూడా బైడెన్ ఎన్నికపై శుభాకాంక్షలు తెలిపింది. కానీ, పుతిన్‌ మాత్రం అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ను గుర్తించేందుకు సిద్ధంగా లేనని తాజాగా ప్రకటించారు.

ఇదిలాఉంటే, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటూ.. ట్రంప్‌నకు సాయం చేసారని రష్యాపై అమెరికా ఇంటెలిజెన్స్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రష్యా కాస్త జాగ్రత్తపడింది. అందుకే బైడెన్‌ ఎన్నికపై ఆచితూచి స్పందిస్తోంది.