హిమాచల్‌ప్రదేశ్ ప్రధాన నగరాలలో డిసెంబర్ 15 వరకు నైట్ కర్ఫ్యూ
కరోనా వైరస్‌ను ఎంతగా నియంత్రించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు.. పైపెచ్చు మరింత వ్యాపిస్తోంది.. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు విన్నవించుకుంటున్నా..
కరోనా వైరస్‌ను ఎంతగా నియంత్రించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు.. పైపెచ్చు మరింత వ్యాపిస్తోంది.. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు విన్నవించుకుంటున్నా చెవికి ఎక్కించుకోవడం లేదు.. అందుకే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు తమ ప్రధాన నగరాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి.. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలు వారానికి మూడు రోజుల చొప్పున నైట్ కర్ఫ్యూ విధించాయి.. హిమాచల్‌ప్రదేశ్ కూడా ఈ బాటలోనే పయనించింది.. డిసెంబర్ 15 వరకు మండి, సిమ్లా, కులు, కాంగ్రా పట్టణాలలో నైట్ కర్ఫ్యూ విధించింది.. ఈ నిబంధన రేపటి నుంచి అమలులోకి వస్తుంది.. ఒక్క కర్ఫ్యూతోనే కరోనాను నియంత్రించలేమని తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్ సర్కారు ప్రభుత్వ కార్యాలయాలను 50 శాతం ఉద్యోగులతోనే పని చేయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులు ఇక నుంచి 50 శాతం మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ నిబంధన వచ్చే నెల 31 వరకు అమలులో ఉంటుంది..