ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఏపీలో ‘అభయం ప్రాజెక్టు’ (యాప్‌)ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఏపీలో ‘అభయం ప్రాజెక్టు’ (యాప్‌)ను సీఎం వైయస్‌ జగన్‌ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు.

ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఏపీలో ‘అభయం ప్రాజెక్టు’ (యాప్‌)ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 23, 2020 | 4:59 PM

ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఏపీలో ‘అభయం ప్రాజెక్టు’ (యాప్‌)ను సీఎం వైయస్‌ జగన్‌ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన, వారి రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అన్ని కోణాల్లోనూ వారికి కొండంత అండగా ఉంటున్నామని, ఆ దిశలో గత 17 నెలలుగా అనేక కార్యక్రమాలు అమలుకు నోచుకున్నాయన్నారు. ఇప్పుడు ‘అభయం ప్రాజెక్టు’ (యాప్‌) ద్వారా మరో అడుగు ముందుకు వేశామని సీఎం చెప్పారు.

ఆటోలు, టాక్సీలలో ప్రయాణించే అక్క చెల్లెమ్మలకు పూర్తి భద్రత ఉంటుందని, అయితే, మన ఆటోలు, టాక్సీ డ్రైవర్లపై నమ్మకం లేక కాదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. వారిపై మరింత విశ్వాసం పెంపొందిచడమే ఈ యాప్‌ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ సంస్ధలు నడిపే టాక్సీలకు ధీటుగా ప్రయాణికులకు భద్రత కల్పించడం, ఆ స్ధాయిలో మన ఆటోలు, టాక్సీలు కూడా సేవలందిస్తాయన్న భరోసా ఇవ్వడమే దీనికి తార్కాణమని సీఎం చెప్పారు. అదే విధంగా పిల్లలు, అక్క చెల్లెమ్మలలో మనోధైర్యం పెంచడమూ.. ఆ విధంగా అందరికీ మేలు చేసే విధంగా ప్రభుత్వం పనులు చేస్తుందన్నారు.