టీమిండియా ప్లేయర్లు రెచ్చగొట్టినా స్లెడ్జింగ్‌ జోలికి వెళ్లను: వార్నర్‌

హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ లేకపోతేనేం.. టీమిండియాలో బోలెడంతమంది అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారంటున్నాడు ఆస్ట్రేలియా టీమ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. టీమిండియాలో రోహిత్‌శర్మ కీలక ఆటగాడని..

టీమిండియా ప్లేయర్లు రెచ్చగొట్టినా స్లెడ్జింగ్‌ జోలికి వెళ్లను: వార్నర్‌
Follow us
Balu

|

Updated on: Nov 23, 2020 | 4:18 PM

హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ లేకపోతేనేం.. టీమిండియాలో బోలెడంతమంది అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ ఉన్నారంటున్నాడు ఆస్ట్రేలియా టీమ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. టీమిండియాలో రోహిత్‌శర్మ కీలక ఆటగాడని, లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లకు రోహిత్‌ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటేనని అన్నాడు వార్నర్‌.. అయితే కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌ వంటి చక్కటి ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని వివరించాడు. వీరంతా ఇటీవల ముగిసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీలో పరుగుల వరదను పారించారని చెప్పాడు. వీరంతా రోహిత్‌ స్థానాన్ని భర్తీ చేసేవారేనని తెలిపాడు. ఈసారి స్లెడ్జింగ్‌కు దూరంగా ఉంటానని మాట ఇచ్చాడు.. ఒకవేళ భారత్‌ ఆటగాళ్లు రెచ్చగొట్టినా తన అనుభవాన్ని ఉపయోగించుకుని బ్యాట్‌తోనే జవాబివ్వాలని అనుకుంటున్నానని వార్నర్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించిన ప్రతీసారి రెండు జట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారు.. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈసారి మాత్రం స్లెడ్జింగ్‌ జోలికే వెళ్లనని, కేవలం ఆట మీదనే దృష్టి పెడతానని వార్నర్‌ తెలిపాడు. లాస్టియర్‌ ఇంగ్లాండ్‌ టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్లెడ్జింగ్‌కు దూరంగా ఉండాలని గట్టిగా డిసైడయ్యానని, ఫ్యూచర్‌లో కూడా అలాగే ఉంటానని హామీ ఇచ్చాడు వార్నర్‌. చివరి మూడు టెస్ట్‌ మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం తమకు కలిసొచ్చే అంశమని వార్నర్‌ పేర్కొన్నాడు.