టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓట్లు అడిగే హక్కుంది.. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఐదో జనరల్‌బాడీ సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్య
జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటు అడిగేహక్కు ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకే ఉందని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలతో పాటు, పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, వరదల సమయంలో
జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటు అడిగేహక్కు ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకే ఉందని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలతో పాటు, పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, వరదల సమయంలో సాయం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సోమవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఐదో జనరల్‌బాడీ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ సామాన్యుడి కోసమే ధరణి పోర్టల్, తదితరసంస్కరణలను తీసుకు వచ్చామన్నారు. బిల్డర్ల సమస్యలను కూడా తాను తెలుసుకున్నానని, వారితో డిసెంబరు 4వ తేదీ తర్వాత సమావేశమవుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బిల్డర్ల సమస్యలను సమస్యలను తీర్చే బాధ్యత తనదేనని కేటీఆర్ ఈ సందర్భంగా అభయమిచ్చారు. బతుకు తెరువుకోసం వచ్చిన వారంతా మా వాళ్లేనని సీఎం కేసీఆర్ అప్పుడే చెప్పారని, ఆరేళ్లలో ఆ మాట నిజమని నిరూపితమైందన్నారు. అందుకే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో సాగుతోందని కేటీఆర్ తెలిపారు.