స్వార్థం కోసమే అమరావతి మహిళల ఆందోళన: రెచ్చిపోయిన రోజా

అమరావతిలో ఆందోళన చేసేందుకు హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి మహిళలను తరలిస్తూ టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని లోకేశ్‌కు సన్నిహితుడైనా ఓ సినీ డైరెక్టరే స్వయంగా ట్వీట్ చేశాడని చెప్పారు రోజా. అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళలు కేవలం స్వార్థంతోనే ఉద్యమిస్తున్నారని ఆమె అన్నారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన రోజా.. సెన్సేషన్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలను తీవ్రమైన పదజాలంతో దుయ్యబట్టారు. ‘‘అమరావతిలో ఆడంగి వెధవల్లాగా వెనక […]

  • Rajesh Sharma
  • Publish Date - 4:51 pm, Mon, 13 January 20
స్వార్థం కోసమే అమరావతి మహిళల ఆందోళన: రెచ్చిపోయిన రోజా

అమరావతిలో ఆందోళన చేసేందుకు హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి మహిళలను తరలిస్తూ టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని లోకేశ్‌కు సన్నిహితుడైనా ఓ సినీ డైరెక్టరే స్వయంగా ట్వీట్ చేశాడని చెప్పారు రోజా. అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళలు కేవలం స్వార్థంతోనే ఉద్యమిస్తున్నారని ఆమె అన్నారు.

సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన రోజా.. సెన్సేషన్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలను తీవ్రమైన పదజాలంతో దుయ్యబట్టారు. ‘‘అమరావతిలో ఆడంగి వెధవల్లాగా వెనక దాక్కుని ఆడవాళ్ళని ముందు పెట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు.. ఆడవాళ్ళని రోడ్ల మీదికి వదిలి పోలీసులు కొట్టారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు.. అమరావతిలో మగవాళ్ళు లేరా?.. మగవాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ములేదా..? మీరు చేసిన తప్పులకు ఆడవాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు ’’ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను రోజా చెడామడా ఏకిపారేశారు.

అమరావతిలో మహిళలంతా స్వార్ధంతోనే ఉద్యమాలు చేస్తున్నారని, హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి బస్సుల్లో వచ్చి మరీ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని రోజా అన్నారు. ‘‘లోకేశ్ స్నేహితుడైన ఒక డైరెక్టర్ కూడా ట్విట్టర్‌లో మనవాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్లి ధర్నాలు బాగా చేస్తున్నారు‘‘ అని ట్వీట్ చేశారని రోజా వివరించారు. ‘‘చంద్రబాబు లాంటి దరిద్రుడు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాము’’ అంటూ రోజా రెచ్చిపోయారు.

రాయలసీమ ప్రజలు చంద్రబాబుని కొడితే వైసీపీ వాళ్ళు దాడి చేసారంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని, తనకు స్వార్ధం ఉంటే తిరుపతిలో రాజధాని పెట్టమని ఆడిగేదాన్నని, ముఖ్యమంత్రి కోరుకుంటే కడపలో రాజధాని పెట్టుకునే వారని వ్యాఖ్యానించారు రోజా.