Watch: విశ్వాసం, ప్రేమంటే ఇదే.. కుక్కకు సమాధి కట్టి రోజూ పూజిస్తున్న కుటుంబం.. ఎక్కడంటే
సాధారణంగా ఇంట్లో వాళ్లు ఎవరైనా చనిపోతే.. వారికి సమాధి కట్టడం తరాల నాటి ఆచారం.. ఇది అందరికీ తెలుసు. కానీ మీరెప్పుడైనా జంతువులకు సమాధి కట్టడం చూశారా? అవును ఇక్కడో కుటుంబ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్క చినిపోవడంతో దానిని కననం చేసి సమాధి కట్టించారు. ఇదే కాదు.. దాన్ని బతికించుకునేందుకు వాళ్లు లక్షలు ఖర్చు చేశారు కానీ.. దాని ప్రాణాలను కాపాడుకోలేక పోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది.

కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి ఒక్క ముద్ద అన్నం పెడితే.. అవి ఎంతో విశ్వాసంగా ఆ వ్యక్తికి కాపలగా ఉంటాయి. అతనికి ఏదైనా ఆపద వస్తే.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్లను కాపాడుతాయి. వాటికి ఉండే ఈ విశ్వాసమే.. యజమానులకు వాటిపై ప్రేమను పెంచేలా చేస్తాయి. ఇలానే తమ కుటుంబంలో ఒకటైన కుక్క చనిపోవడంతో దానికి సమాధిని కట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వైద్యుడి కుటుంబం. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన శునకానికి వైద్యం చేయించేందుకు వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు ఈ కుక్క ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు దాని గుర్తుగా సమాధి కట్టించారు.
వివరాల్లోకెళ్తే.. చిత్తూరుకు చెందిన డాక్టర్ సుదర్శన్, గాయత్రీ దేవి దంపతులు 9 ఏళ్ల క్రితం రాట్ విల్లర్ జాతికి చెందిన ఒక కుక్కను ఇంటికి తెచ్చుకున్నారు. ఆ కుక్కకు బాక్సీ అని పేరు పెట్టుకున్నారు. చిన్న పిల్ల నుండి పెంచడం వల్ల ఆ కుటుంబంలో అది ఒక సభ్యుడిగా పెరిగింది. అంతే ప్రాధాన్యత ఆ ఇంట్లో సొంతం చేసుకుంది. ఇంట్లో రెండుసార్లు దొంగతనం జరిగితే.. దొంగలను పట్టుకోవడంలోనూ బాక్సీ కీలక పాత్ర పోషించండి. ఇలా ఎన్నో రోజులుగా ఇక బాక్సీ పగలు రాత్రి ఇంటికి కాపలా ఉంటూ అందరి మన్ననలు అందుకుంది.
అయితే ఈ మధ్యనే అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లడిల్లిపోయిన కుటుంబం కుక్కను పశువుల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దానికి బాగు చేసేందుకు చెన్నై, బెంగళూరులోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు.. దాని వైద్యం కోసం సుమారు రూ.7 లక్షల వరకు ఖచ్చు పెట్టారు. అయినా బాక్సీని మాత్రం బతికించుకోలేక పోయారు. చివరకు నవంబర్ 11న చికిత్స పొందుతూ బాక్సీ తుదిశ్వాస విడిచింది.
బాక్సీ మరణాన్ని ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు. దాని జ్ఞాపకార్థం సాంప్రదాయ రీతిలో కుక్కకు అంత్యక్రియలు జరిపి.. భారీగా ఖర్చు పెట్టి సమాధిని నిర్మించారు. ఆ సమాధిపై బాక్సీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కుక్క జ్ఞాపకాలు తలుచుకుంటూ రోజు సమాధి వద్దకు వెళ్లి పూజలు కూడా చేస్తున్నారు. మనుషులు పోతేనే పట్టించుకొని ఈ రోజుల్లో పెంపుడు కుక్కను సైతం ఇంతలా చూసుకోవడం గమనార్హం.స
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
