రాహుల్ బావ తికమక.. నెటిజన్స్ ఫైర్

రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఆరోదశ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. ట్విట్టర్‌లో “నేను ఓటు వేశాను” అంటూ సిరాచుక్కతో ఉన్న వేలును చూపిస్తూ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే వాద్రా ట్విటర్‌లో షేర్‌ చేసిన సెల్ఫీ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు విలువను వివరిస్తూ ఆయన రాసిన సందేశమంతా సరిగ్గానే ఉన్నప్పటికీ, చిట్టచివరన భారత జాతీయ పతాకం గుర్తుకు బదులు పరాగ్వే పతాకం ఎమోజీని అటాచ్‌ […]

రాహుల్ బావ తికమక.. నెటిజన్స్ ఫైర్
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 10:21 AM

రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఆరోదశ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. ట్విట్టర్‌లో “నేను ఓటు వేశాను” అంటూ సిరాచుక్కతో ఉన్న వేలును చూపిస్తూ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే వాద్రా ట్విటర్‌లో షేర్‌ చేసిన సెల్ఫీ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు విలువను వివరిస్తూ ఆయన రాసిన సందేశమంతా సరిగ్గానే ఉన్నప్పటికీ, చిట్టచివరన భారత జాతీయ పతాకం గుర్తుకు బదులు పరాగ్వే పతాకం ఎమోజీని అటాచ్‌ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. పరాగ్వే పౌరుడినని వాద్రా ఇప్పటికైనా అంగీకరించారంటూ ఒకరు కామెంట్‌ చేయగా.. వాద్రా తికమక పడి కాంగ్రె‌సకు బదులు బీజేపీకి ఓటు వేసి ఉండొచ్చంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పోస్టును తొలగించిన వాద్రా.. భారత పతాకంతో మరో ట్వీట్‌ చేశారు.