‘ఐరన్ లేడీ’కి ట్విన్స్

సామాజిక హక్కుల కార్యకర్త, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఇరోమ్ షర్మిల కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మదర్స్‌ డే రోజున(ఆదివారం) ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వారికి నిక్స్ సఖి, ఆటమ్ తారా అనే పేర్లను నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. చాలా సంతోషంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మణిపూర్‌ రాష్ట్రంలో ఆర్మీకి గల ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా.. ఆమె […]

‘ఐరన్ లేడీ’కి ట్విన్స్
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 1:07 PM

సామాజిక హక్కుల కార్యకర్త, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఇరోమ్ షర్మిల కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మదర్స్‌ డే రోజున(ఆదివారం) ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వారికి నిక్స్ సఖి, ఆటమ్ తారా అనే పేర్లను నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. చాలా సంతోషంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

కాగా మణిపూర్‌ రాష్ట్రంలో ఆర్మీకి గల ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా.. ఆమె 16సంవత్సరాలుగా నిరాహార దీక్షను చేశారు. ఆ తరువాత వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలతో దీక్షను విరమించిన షర్మిల.. 2017లో తన చిరకాల ప్రియుడు డెస్‌‌మండ్ కౌటిన్హోను వివాహం చేసుకొని.. కొడైకనాల్‌లో సెటిల్ అయ్యారు.