AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google షాకింగ్ నిర్ణయం? సెర్చ్ బార్ నుంచి AI Mode బటన్ మాయం.. అసలేం జరుగుతోంది?

గూగుల్ తన సెర్చ్ పేజీలో మరో కీలక మార్పును పరీక్షిస్తోంది. సెర్చ్ బార్‌లో కనిపించే ప్రత్యేకమైన AI Mode బటన్‌ను కొంతమంది వినియోగదారులకు తొలగించినట్లు తాజా మీడియా నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా Chrome బ్రౌజర్‌లో అజ్ఞాత (Incognito) మోడ్‌తో పాటు AI Mode షార్ట్‌కట్ కూడా కనిపించడం లేదని పలువురు గుర్తించారు. అయితే, ఈ మార్పు ప్రస్తుతం కొద్దిమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే పరిమితమైంది.

Google షాకింగ్ నిర్ణయం? సెర్చ్ బార్ నుంచి AI Mode బటన్ మాయం.. అసలేం జరుగుతోంది?
Google Ai
Balaraju Goud
|

Updated on: Nov 04, 2026 | 2:55 PM

Share

గూగుల్ తన సెర్చ్ పేజీలో మరో కీలక మార్పును పరీక్షిస్తోంది. సెర్చ్ బార్‌లో కనిపించే ప్రత్యేకమైన AI Mode బటన్‌ను కొంతమంది వినియోగదారులకు తొలగించినట్లు తాజా మీడియా నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా Chrome బ్రౌజర్‌లో అజ్ఞాత (Incognito) మోడ్‌తో పాటు AI Mode షార్ట్‌కట్ కూడా కనిపించడం లేదని పలువురు గుర్తించారు. అయితే, ఈ మార్పు ప్రస్తుతం కొద్దిమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే పరిమితమైంది.

Chromeలో AI Mode షార్ట్‌కట్ మాయం!

ఈ మార్పును లెన్ రాలీ అనే టెక్ పరిశీలకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వెల్లడించారు. Chromeలోని Google Search బార్ నుంచి Incognito Mode, AI Mode షార్ట్‌కట్‌లు కనిపించడం లేదని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని Search Engine Roundtable కూడా తన నివేదికలో ప్రస్తావించింది. అయితే, అన్ని టూల్స్‌ల్లోనూ ఈ మార్పు కనిపించడం లేదని రాలీ తెలిపారు. తన మరో కంప్యూటర్‌లో, అలాగే వేర్వేరు సెషన్లలో AI Mode బటన్ యథావిధిగా కనిపిస్తోందని వివరించారు. దీన్నిబట్టి గూగుల్ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వినియోగదారులతో A/B టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

AI Modeను గూగుల్ తొలగించబోతోందా?

సెర్చ్ బార్‌లో ప్రత్యేకమైన బటన్ లేకపోతే వినియోగదారులు AI Modeను ఎంతవరకు ఉపయోగిస్తారో తెలుసుకోవడమే ఈ పరీక్ష వెనుక ఉద్దేశం కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, AI Modeను పూర్తిగా తొలగించాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

సాధారణంగా గూగుల్ తన సెర్చ్ ఇంటర్‌ఫేస్‌లో కొత్త డిజైన్లు, ఫీచర్లు, షార్ట్‌కట్‌లను ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షిస్తుంది. వాటి నుంచి వచ్చే స్పందన ఆధారంగా మార్పులను కొనసాగించాలా, వెనక్కి తీసుకోవాలా అనేది నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్పును కూడా ఒక ప్రయోగంగానే చూడాలి.

Google AI Mode అంటే ఏమిటి? భారత్‌లో ఎప్పుడు ప్రారంభమైంది?

Google AI Mode అనేది కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ప్రత్యేక సెర్చ్ ఫీచర్. దీనిని గూగుల్ 2025 మే నెలలో పరిచయం చేసింది. సాధారణంగా కీలక పదాలతో సెర్చ్ చేయడానికి బదులుగా, వినియోగదారులు తమ ప్రశ్నలను పూర్తి వివరాలతో అడగవచ్చు. AI Mode పలు ఆన్‌లైన్ మూలాల నుంచి సమాచారాన్ని విశ్లేషించి సమగ్ర సమాధానాలను అందిస్తుంది. అంతేకాకుండా, సమాధానం వచ్చిన తర్వాత సంబంధిత ప్రశ్నలను అడిగే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఒకే సంభాషణలో అంశంపై మరింత సమాచారం తెలుసుకోవచ్చు. భారత్‌లో గూగుల్ AI Modeను 2025 జూన్ నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం వాయిస్, ఇమేజ్ ఆధారంగా ప్రశ్నలు అడిగే సదుపాయాలతో పాటు ఇతర కొత్త ఫీచర్లను కూడా జోడించింది.

ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదు!

సెర్చ్ బార్ నుంచి AI Mode బటన్ కనిపించకపోయినా, ఈ ఫీచర్ పూర్తిగా నిలిచిపోతుందని అర్థం కాదు. ఇది పరిమిత పరీక్ష మాత్రమే కావడంతో భవిష్యత్తులో గూగుల్ ఈ బటన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావచ్చు లేదా సెర్చ్ ఇంటర్‌ఫేస్‌లో మరో విధంగా అమర్చవచ్చు. దీనిపై గూగుల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us