ముగ్గురు ఎమ్మెల్యేలపై బహిష్కరవేటు
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బహిష్కరణ ఆరేళ్ల పాటు కొనసాగుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రేమ చౌదరి, మహేశ్ ప్రసాద్ యాదవ్, ఫరాజ్ ఫాత్మీను బహిష్కరిస్తూ పార్టీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఆర్జీడీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉంటూ జేడీయూ పార్టీ నేతలతో సఖ్యతగా ఉంటున్నారన్నవార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ఈ ముగ్గురూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచనల మేరకు వారిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి అలోక్ మెహతా ప్రకటించారు. ఈ ముగ్గురు కూడా అధికార జేడీయూలో చేరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు నితీశ్ కుమార్‌ను బహిరంగంగానే మెచ్చుకున్నారు. దీంతో ఆర్జేడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.