‘దిశ ఎన్‌కౌంటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రాజెక్ట్‌కు నాంది పలికారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

RGV New Movie Update: రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రాజెక్ట్‌కు నాంది పలికారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అలాగే నవంబర్ 26న ఈ మూవీ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. నవంబర్ 26, 2019లో దిశ ఘటన జరగగా, ఏడాది తరువాత అదే రోజున వర్మ దిశ మూవీని విడుదల చేస్తున్నట్లు చెప్పడం విశేషం.
గత ఏడాది హైదరాబాద్ శివార్లలో నలుగురు యువకులు దిశ అనే అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆ తదుపరి కాల్చి వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేపగా, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నలుగురు యువకులను పట్టుకున్న పోలీసులు, తరువాత ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు.
కాగా ఈ ఘటనపై మూవీ చేస్తానని వర్మ ఎప్పుడో ప్రకటించారు. నలుగురు నిందుతుల్లో ఒకడైన జొల్లు నవీన్ భార్యను వర్మ ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఆమెను తన ఆఫీస్ కి పిలిపించుకున్న వర్మ అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. కాగా నేడు ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచేశారు.
Here is the 1st look film poster of DISHA ENCOUNTER made on the brutal gang rape,killing and burning of a young woman in Hyderabad on NOVEMBER 26th 2019 ..Teaser release SEPTEMBER 26th ..Film release NOVEMBER 26 th 2020 @anuragkancharla @Karuna_Natti #DishaEncounter pic.twitter.com/hnx34PKqE9
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2020
Disha gang rape which happened on NOVEMBER 26th 2019 aroused such anger throughout India,that government not only changed rape laws but also for 1st time in world created DISHA police stations named after a victim ..DISHA ENCOUNTER film releasing NOVEMBER 26 th 2020 pic.twitter.com/ZBTsNmhFzd
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2020



