బ్రేకింగ్: మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు..!

తెలంగాణాలో 13 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎస్టీ రిజర్వుడు.. అలాగే రామగుండం కార్పొరేషన్‌ను ఎస్సీ రిజర్వుడుకు కేటాయించారు. ఇక జవహర్‌నగర్, నిజామాబాద్, బండ్లగూడ, జాగీర్, వరంగల్‌ను బీసీకి రిజర్వ్ చేశారు. అటు జనరల్‌కి 7..  ఎస్టీ-1, ఎస్సీ-1కు ఒక్కొక్కటి కాగా, బీసీలకు 4 రిజర్వ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈసీ రిజర్వేషన్లను ప్రకటించింది. బీసీలకు 50 శాతం మించకుండా.. మహిళలకు వార్డుల్లో 50 శాతం రిజర్వేషన్లు […]

బ్రేకింగ్: మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 05, 2020 | 12:59 PM

తెలంగాణాలో 13 మున్సిపల్ కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎస్టీ రిజర్వుడు.. అలాగే రామగుండం కార్పొరేషన్‌ను ఎస్సీ రిజర్వుడుకు కేటాయించారు. ఇక జవహర్‌నగర్, నిజామాబాద్, బండ్లగూడ, జాగీర్, వరంగల్‌ను బీసీకి రిజర్వ్ చేశారు. అటు జనరల్‌కి 7..  ఎస్టీ-1, ఎస్సీ-1కు ఒక్కొక్కటి కాగా, బీసీలకు 4 రిజర్వ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈసీ రిజర్వేషన్లను ప్రకటించింది.

బీసీలకు 50 శాతం మించకుండా.. మహిళలకు వార్డుల్లో 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తోంది. ఎస్సీ, ఎస్టీ జనాభాలు ఒక్క శాతం కంటే తక్కువగా ఉన్నా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు కేటాయించారు. అటు 123 పురపాలికల చైర్మన్లలో  ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్‌ -62 స్థానాలను కేటాయించారు.

పాయింట్ల వారీగా ఒకసారి చూస్తే… 

*ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు: ఆమనగల్, వర్ధన్నపేట, డోర్నకల్, మరిపెడ

* ఎస్సి రిజర్వుడ్ స్థానాలు: క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, ఇబ్రహీంపట్నం, వైరా, లీజా, పెబ్బేరు, నస్పూర్, ఆలంపూర్

*బీసీ రిజర్వుడ్ స్థానాలు: సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూర్, భీంగల్, ఆర్మూరు, కోస్గి, నారాయణఖేడ్, మెట్‌పల్లి, ఆందోల్, జోగిపేట, జగిత్యాల, గద్వాల్, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పరిగి, వనపర్తి, అమరచింత.  కాగా, కాసేపట్లో మహిళా రిజర్వుడ్ స్థానాలను ప్రకటించనున్నారు.