హైదరాబాద్‌కు చరితారెడ్డి మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. నేరేడ్‌మెట్ నివాసానికి ఆమె డెడ్‌ బాడీని తీసుకొచ్చారు. కూతురు మృతదేహం చూసిన చరితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. 2019 డిసెంబర్ 27న మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును.. వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో బ్రెయిన్‌డెడ్‌కు గురైంది చరితారెడ్డి. వెంటనే ఆమెను […]

హైదరాబాద్‌కు చరితారెడ్డి మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 12:45 PM

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. నేరేడ్‌మెట్ నివాసానికి ఆమె డెడ్‌ బాడీని తీసుకొచ్చారు. కూతురు మృతదేహం చూసిన చరితారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.

2019 డిసెంబర్ 27న మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి దుర్మరణం చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును.. వెనక నుంచి మరో కారు వేగంగా ఢీకొట్టడంతో బ్రెయిన్‌డెడ్‌కు గురైంది చరితారెడ్డి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. బ్రెయిన్‌ డెడ్ అయి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. కాగా.. చరితారెడ్డి చనిపోయినా ఆమె అవయవాలు 9 మందికి పున: జన్మనిచ్చాయి.

ఆమె కుటుంబ సభ్యుల పర్మిషన్‌తో చరితారెడ్డి అవయవాలు డొనేట్ చేశారు డాక్టర్లు. లివర్, గుండె కవాటాలు, కిడ్నీలు, కళ్లను డాక్టర్లు స్థానిక గిఫ్ట్ లైఫ్ హాస్పిటల్‌లో ఆమె బాడీ నుంచి తీశారు. తాను చనిపోయి.. 9మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అంటూ  అమెరికా సమాజం ఆమెను కీర్తిస్తోంది.