మజా అనుకుని పురుగులమందు తాగిన బాలికలు..పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లా నెన్నల మండలం నందులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న అస్మిత (10), హారిక (10) అనే ఇద్దరి విద్యార్థినులు మజా అని భావించి పురుగుల మందు సేవించారు. స్కూల్ పరిసరాల్లో ఆడుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు దారిలో దొరికిన రసాయన డబ్బాను.. మజా బాటిల్ అనుకుని తాగడంతో ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. స్థానికులు వారిని గుర్తించి హుటాహుటిన  బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రి తరలించారు. విద్యార్థినులు ఈథానాపిల్ […]

మజా అనుకుని పురుగులమందు తాగిన బాలికలు..పరిస్థితి విషమం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2020 | 6:06 PM

మంచిర్యాల జిల్లా నెన్నల మండలం నందులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న అస్మిత (10), హారిక (10) అనే ఇద్దరి విద్యార్థినులు మజా అని భావించి పురుగుల మందు సేవించారు. స్కూల్ పరిసరాల్లో ఆడుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు దారిలో దొరికిన రసాయన డబ్బాను.. మజా బాటిల్ అనుకుని తాగడంతో ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. స్థానికులు వారిని గుర్తించి హుటాహుటిన  బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రి తరలించారు. విద్యార్థినులు ఈథానాపిల్ అనే పురుగుల మందు తాగినట్టుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వారిని మంచిర్యాల ఆసుపత్రికి  తరలించారు. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.