తృటిలో తప్పిన ప్రమాదం.. బాక్సర్ బచ్ గయా !

అది లండన్ శివార్లలోని డోవర్ ప్రాంతం.. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతం.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో కస్టమర్లు లేక బోసిపోతున్న పిజ్జా షాపు దగ్గరగా నడచుకుంటూ వెళ్తున్నాడు ఓ బాక్సర్.. అతని పేరు జాక్ మెక్ కేబ్. ఏదో ఆలోచించుకుంటూ పరధ్యాన్నంగా వెళ్తుండగా ఒక్కసారిగా అతి వేగంగా ఓ వ్యాన్ దూసుకువచ్చి.. అతడ్ని దాదాపు ఢీ కొంటూ ..వెళ్ళిపోయింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వాహనం ధాటికి జాక్ కింద పడిపోయి తీవ్ర గాయాల […]

తృటిలో తప్పిన ప్రమాదం.. బాక్సర్ బచ్ గయా !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2020 | 5:39 PM

అది లండన్ శివార్లలోని డోవర్ ప్రాంతం.. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతం.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో కస్టమర్లు లేక బోసిపోతున్న పిజ్జా షాపు దగ్గరగా నడచుకుంటూ వెళ్తున్నాడు ఓ బాక్సర్.. అతని పేరు జాక్ మెక్ కేబ్. ఏదో ఆలోచించుకుంటూ పరధ్యాన్నంగా వెళ్తుండగా ఒక్కసారిగా అతి వేగంగా ఓ వ్యాన్ దూసుకువచ్చి.. అతడ్ని దాదాపు ఢీ కొంటూ ..వెళ్ళిపోయింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వాహనం ధాటికి జాక్ కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యేవాడే.. అయితే వ్యాన్ వస్తున్న దృశ్యాన్నిముందే చూశాడో ఏమో గానీ.. ఆ వాహనం తాకగానే  ముఖానికి చేతులు అడ్డు పెట్టుకున్నాడు. కానీ వాహనం ధాటికి విసురుగా ఆ పిజ్జా షాపు విండోకి కొట్టుకున్నాడు. అదృష్టవశాత్తూ ఏ మాత్రం గాయపడకుండా తృటిలో బయటపడ్డాడు. ఈ సంఘటనలో ఆ షాపు కిటికీ అద్దాలు ధ్వంసమై  గాజు ముక్కలన్నీ చెల్లా చెదురుగా కింద పడ్డాయి. జాక్ ను ఢీ కొట్టిన వ్యాన్ కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ఆ వాహన డ్రైవర్ ని అదేపనిగా శాపనార్థాలు పెట్టకుండా జాక్ ఊరుకుంటాడా ? ఏమైనా.. ఈ వీడియో చూస్తే ఒళ్ళు జలదరించాల్సిందే ?