పాక్‌లో దారుణం..సిక్కు యువకుడి దారుణ హత్య..
పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. పెషావర్‌లో భారత సంతతికి చెందిన 29 ఏళ్ల సిక్కు యువకుడు పర్వీందర్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతుడు గత కొంతకాలంగా మలేషియాలో నివశిస్తున్నాడు. ఇటీవలే పెళ్లితో పాటు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం పాక్‌కు వచ్చాడు. తన మ్యారేజ్‌కు సంబంధించిన వస్తువులు కొనుగోలు చెయ్యడానికి వెళ్లిన సమయంలో పర్వీందర్ సింగ్‌ను కాల్చిచంపారు దుండగులు. ఈ ఘటనపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. మైనారటీలే టార్గెట్‌గా జరిగిన ఈ హత్య […]
పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. పెషావర్‌లో భారత సంతతికి చెందిన 29 ఏళ్ల సిక్కు యువకుడు పర్వీందర్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతుడు గత కొంతకాలంగా మలేషియాలో నివశిస్తున్నాడు. ఇటీవలే పెళ్లితో పాటు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం పాక్‌కు వచ్చాడు. తన మ్యారేజ్‌కు సంబంధించిన వస్తువులు కొనుగోలు చెయ్యడానికి వెళ్లిన సమయంలో పర్వీందర్ సింగ్‌ను కాల్చిచంపారు దుండగులు. ఈ ఘటనపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. మైనారటీలే టార్గెట్‌గా జరిగిన ఈ హత్య కేసులో నిందితులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇతర దేశాలకు హితబోధ చేసేముందు, వారి దేశంలో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై చర్యలు తీసుకోవాలని భారత్, పాక్‌కు సూచించింది. నన్‌కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడి ఘటన మరవకముందే ఈ హత్య జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.