జెఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తత..ముసుగులతో విద్యార్థులపై దాడి
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ముసుగుల ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థుల హాస్టల్స్‌పై దాడులకు తెగబడినట్లు సమాచారం. ఈ ఘటనతో యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ ఐషే ఘోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. “ముసుగులు ధరించిన గూండాలు నాపై దారుణంగా దాడి చేశారు. నాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. నన్ను దారుణంగా కొట్టారు” అని ఆమె ఏఎన్‌ఐ వార్త సంస్థకు తెలిపారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించారని […]
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ముసుగుల ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థుల హాస్టల్స్‌పై దాడులకు తెగబడినట్లు సమాచారం. ఈ ఘటనతో యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ ఐషే ఘోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. “ముసుగులు ధరించిన గూండాలు నాపై దారుణంగా దాడి చేశారు. నాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. నన్ను దారుణంగా కొట్టారు” అని ఆమె ఏఎన్‌ఐ వార్త సంస్థకు తెలిపారు.
సాయంత్రం 6.30 గంటల సమయంలో 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్యాంపస్‌కు రాడ్లు, కర్రలతో వచ్చిన వచ్చిన బయటి వ్యక్తులతో కలిసి ఏబివిపి పనిచేస్తుందని ఆరోపిస్తూ, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్ మూన్ పేర్కొన్నారు. కాగా విద్యార్థులను రక్షించడానికి ప్రయత్నించిన ప్రొఫెసర్లపై కూడా మూక దాడులకు పాల్పడింది. కాగా ఈ దాడుల్లో కొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున్న జేఎన్‌యూకి చేరుకున్నాయి. ఈ ఘటనను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం తీవ్రంగా ఖండించారు.