AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఏఏపై బాలీవుడ్ మద్దతు కోసం.. ‘ కమలం ‘ కష్టాలు

సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబుకుతున్న వేళ.. పాలక బీజేపీ ఈ చట్టం మీద బాలీవుడ్ మద్దతుకోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగే సమావేశానికి పలువురు స్టార్స్ ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్టీ ఉపాధ్యక్షుడు జే పాండా ఆహ్వానించారు. ఈ చట్టంపై ప్రజల్లో ఏర్పడిన ‘ భ్రమలు ‘, ‘ వాస్తవాలు ‘ అన్న అంశంపై జరిగే  చర్చలకు అనువుగా జరిగే సమావేశమే ప్రధాన అజెండా అని […]

సీఏఏపై బాలీవుడ్ మద్దతు కోసం.. ' కమలం ' కష్టాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 05, 2020 | 5:49 PM

Share

సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబుకుతున్న వేళ.. పాలక బీజేపీ ఈ చట్టం మీద బాలీవుడ్ మద్దతుకోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగే సమావేశానికి పలువురు స్టార్స్ ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్టీ ఉపాధ్యక్షుడు జే పాండా ఆహ్వానించారు. ఈ చట్టంపై ప్రజల్లో ఏర్పడిన ‘ భ్రమలు ‘, ‘ వాస్తవాలు ‘ అన్న అంశంపై జరిగే  చర్చలకు అనువుగా జరిగే సమావేశమే ప్రధాన అజెండా అని ఇన్విటేషన్ పత్రంలో పేర్కొన్నారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో ఈ మీటింగ్ జరుగుతుందని, అనంతరం ‘ డిన్నర్ ‘ ఉంటుందని కూడా ‘ తెలియజేశారు’. రిచా ఛధ్ధా, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, రాజ్ కుమార్ హీరానీ, మధుర్ భండార్కర్, బోనీ కపూర్ వంటి వారిని ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే సీఏఏని బాహాటంగానే విమర్శించిన స్వర భాస్కర్, అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ, సుశాంత్ సింగ్ తదితరులను పార్టీ ఆహ్వానించలేదు.  తనను ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేసినా తాను హాజరు కాబోవడంలేదని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రముఖ హీరోయిన్ పేర్కొంది. సీఏఏపై బాలీవుడ్ మిశ్రమ స్పందన వెలిబుచ్ఛుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన  జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన ప్రదర్శన,  వారిపై పోలీసుల దుశ్చర్యను పలువురు స్టార్స్ ఖండిస్తూ ట్వీట్లు చేశారు.అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వంటి కొంతమంది సెలబ్రెటీలు ఈ చట్టాన్ని సమర్థిస్తున్నారు. అయితే  నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జిని, బాష్పవాయు ప్రయోగాన్ని ఖండిస్తూ.. ప్రభుత్వ మౌనాన్ని ప్రశ్నిస్తూ.. అనురాగ్ కశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి దర్శకులు, నటుడు రాజ్ కుమార్ రావు వంటివారు బాహాటంగానే దుయ్యబట్టారు. మరి.. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే సమావేశానికి ఎంతమంది స్టార్స్ హాజరవుతారు.. ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.