‘ నవజ్యోత్ సింగ్ సిధ్దు ఏడీ ‘ ? బీజేపీ సెటైర్
పాకిస్తాన్ లోని గురుద్వారా నన్ కన్నా సాహిబ్ పై జరిగిన దాడిని బీజేపీ ఖండించింది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిధ్ధు ఏడీ అని బీజేపీ నేత మీనాక్షి లేఖి ప్రశ్నించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సిధ్ధు పారిపోయాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఎవరో ఒకరు ఆయన ఆచూకీ కనిపెట్టండి.. ఇంత జరిగినా ఆయన ఐఎస్ఐ చీఫ్ ను హగ్ చేసుకోవడానికి వెళ్లి ఉంటే […]
పాకిస్తాన్ లోని గురుద్వారా నన్ కన్నా సాహిబ్ పై జరిగిన దాడిని బీజేపీ ఖండించింది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిధ్ధు ఏడీ అని బీజేపీ నేత మీనాక్షి లేఖి ప్రశ్నించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సిధ్ధు పారిపోయాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఎవరో ఒకరు ఆయన ఆచూకీ కనిపెట్టండి.. ఇంత జరిగినా ఆయన ఐఎస్ఐ చీఫ్ ను హగ్ చేసుకోవడానికి వెళ్లి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని పట్టించుకోవలసిందే ‘ అని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ లో మతపరమైన మందిరాలపై దాడులు జరుగుతున్నాయని, దశాబ్దాలుగా మరో మతంలోకి మారవలసిందిగా (కన్వర్షన్లు) మైనారిటీలను బెదిరిస్తున్నారని, ఈ వర్గానికి చెందిన బాలికలను, యువతులను ఎంపిక చేసి బలవంతంగా ముస్లిం యువకులతో పెళ్లిళ్లు జరిపిస్తున్నారని మీనాక్షి లేఖి అన్నారు. పోలీసులు, ప్రభుత్వం, కొన్ని సంస్థలవారు కూడా ఇందులో భాగస్వాములే అన్నారు. గురుద్వారాపై ఇటీవల జరిగిన దాడే మైనారిటీలు ఎలా వివక్షకు, వేధింపులకు గురవుతున్నారో నిదర్శనంగా నిలుస్తోందన్నారు.’ పాక్ ఏర్పడినప్పటిప్పటినుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది.. దీనివల్ల తప్పనిసరిగా ఆ దేశం నుంచి మైనారిటీలు మన దేశంలో ప్రవేశించాల్సివస్తోంది.. అంటే సీఏఏ (పౌరసత్వ చట్టం) వంటి చట్టాలు ఉండాలన్న అంశం రుజువవుతోంది ‘ అని మీనాక్షి లేఖి పేర్కొన్నారు. ఈ చట్టం సరైనదేనని, సకాలంలో తీసుకున్నారని పాకిస్తాన్ ఇప్పుడు అంగీకరించినట్టే అని ఆమె అన్నారు. గురుద్వారాపై జరిగిన దాడిని ఆమె ‘ కాబా ‘ లేదా ‘ జెరూసలేం ‘ పై జరిగిన దాడిగా అభివర్ణించారు.