AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో కరోనా తాకిడి తగ్గడం లేదు. ఒడిశాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒడిశాలో కొత్తగా 2,993 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఒడిశాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Aug 23, 2020 | 3:19 PM

Share

దేశంలో కరోనా తాకిడి తగ్గడం లేదు. ఒడిశాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒడిశాలో కొత్తగా 2,993 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 78,530కి చేరాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా అదే స్థాయిలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది. తాజాగా 1,773 మంది కోలుకోగా ఇప్పటి వరకు 52,277 వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 25,791 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,114 లోకల్ కాంటాక్ట్స్ కాగా, 1,879 క్వారంటైన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు వైరస్‌ ప్రభావంతో 53 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇప్పటివరకు ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా 13,02,711 మంది నమూనాలు పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా ఖుర్దాలో 606 నమోదైయ్యాయి. అలాగేలో గంజాం 279, కటక్ 158, పూరి 156, నాయగర్ 153) రాయగఢ్‌ 137, జాజ్‌పూర్ 121, మయూరభంజ్ 120, బాలసోర్ 115, సంబల్పూర్ 104, బార్గర్‌లో 98, కోరాపుట్ 95, భద్రక్ 92, మల్కన్‌గిరి 85, సుందర్‌గర్‌ 70, నబారంగ్‌పూర్ 68, కియోన్‌జార్ 63, బాలంగీర్ 62, ధెంకనల్ 60, కంధమల్ 58, జగత్‌సింగ్‌పూర్ 46, గజపతి, జార్సగూడ (కేంద్రాపుడ) 43, సోనేపూర్ 40, కలహండి 36, అంగుల్ 21, నువాపాడా 11, బౌద్, డియోగర్‌ 9చొప్పున పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా గంజాం జిల్లాలో 16,349, తర్వాత ఖుర్దా జిల్లాలో 11,894 పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Follow Us
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..
దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి
దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి
దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్
దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్
రష్మిక మందన్నకు తీవ్ర గాయం
రష్మిక మందన్నకు తీవ్ర గాయం
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..