పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇమ్రాన్ కు ప్రధాని మోదీ ట్విట్

పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇమ్రాన్ కు  ప్రధాని మోదీ ట్విట్

న్యూఢిల్లీ : పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సాదారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు…కానీ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని బహిష్కరించింది. ఆ దేశ హైకమిషన్ ఏర్పాటు చేసిన రిసెప్షన్ ను కూడా బాయ్ కాట్ చేసింది. ఇంత చేసి ప్రధాని మోడీ మాత్రం పాక్ ప్రధానికి అభినందన సందేశం పంపించారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 4:52 PM

న్యూఢిల్లీ : పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సాదారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు…కానీ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని బహిష్కరించింది. ఆ దేశ హైకమిషన్ ఏర్పాటు చేసిన రిసెప్షన్ ను కూడా బాయ్ కాట్ చేసింది. ఇంత చేసి ప్రధాని మోడీ మాత్రం పాక్ ప్రధానికి అభినందన సందేశం పంపించారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఆ అభినందన సందేశంలో మోడీ ఉపఖండంలో ప్రజాస్వామ్యం, శాంతి, పురోగతి కోసం కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. అలాగే ఉగ్రవాదం, హింస లేని సంస్కృతి కోసం కలసి పని చేద్దామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. మోడీ సందేశాన్ని స్వాగతిస్తున్నానీ, భారత్, పాక్ ల మధ్య కాశ్మీర్ సహా అన్ని సమస్యలూ పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu