ఏలియన్స్ రహస్యంగా మనల్ని గమనిస్తున్నాయా..!

ఏలియన్స్ రహస్యంగా మనల్ని గమనిస్తున్నాయా..!

ఈ విశ్వం మనకు మాత్రమే సొంతం కాదని బలంగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇన్నేళ్లలో వాటికి సంబంధించిన ఏ కచ్చిత ఆధారాన్ని సాధించలేకపోయారు. కానీ ఏలియన్స్ ఉన్నాయంటూ ప్రగాఢంగా నమ్ముతున్న వారు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పారిస్‌లో ఖగోళ శాస్త్రవేత్తలు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో గ్రహాంతర వాసులతో సంబంధాలను పెంచుకునేందుకు ఎందుకు విఫలం అవుతున్నాం అనే అంశంపై వారందరు చర్చించుకున్నారు. అయితే ఈ సమావేశంలో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 5:10 PM

ఈ విశ్వం మనకు మాత్రమే సొంతం కాదని బలంగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇన్నేళ్లలో వాటికి సంబంధించిన ఏ కచ్చిత ఆధారాన్ని సాధించలేకపోయారు. కానీ ఏలియన్స్ ఉన్నాయంటూ ప్రగాఢంగా నమ్ముతున్న వారు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పారిస్‌లో ఖగోళ శాస్త్రవేత్తలు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో గ్రహాంతర వాసులతో సంబంధాలను పెంచుకునేందుకు ఎందుకు విఫలం అవుతున్నాం అనే అంశంపై వారందరు చర్చించుకున్నారు.

అయితే ఈ సమావేశంలో ఓ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ఏలియన్లు మనల్ని ఎప్పుడో గుర్తించాయని చెప్పారు. అయితే వాటి మనగడను మనుషులు తట్టుకోలేరన్న భావనతో అవి మనకు కనిపించకుండా మనల్ని కంటపెడుతున్నాయని అన్నారు. జూలో మనం జంతువులను చూసినట్లుగా ఏలియన్లు కూడా మనల్ని చూస్తున్నాయని ఆ మీటింగ్‌లో పలువురు శాస్త్రవేత్తలు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనికి ఓ ఉదాహరణను చెప్తూ.. జూలో మనం ఒక జీబ్రాను కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తే అది వెంటనే మనపైకి దాడి చేస్తుంది. అలాగే ఏలియన్స్ కూడా భావిస్తున్నాయని చెప్పారు. అంతేకాదు భూమి మీద మనుషులకు ఆటంకం కలిగించకూడదని ఏలియన్స్ భావిస్తున్నాయని, అందుకే మనతో సంబంధం పెట్టుకునేందుకు అవి ఆలోచిస్తున్నాయని పలువురు శాస్త్రవేత్తలు ప్రతిపాదనలో తమ అభిప్రాయాలను పేర్కొన్నారు.

కాగా మెటీ ఇంటర్నేషనల్(మెసేజింగ్ ఎక్స్టాటోరియల్ ఇంటెలిజెన్స్) ఆధ్వర్యంలో ప్రతిఏడాది ఫారిస్‌లో సమావేశమవుతున్నారు శాస్త్రవేత్తలు. ‘ఫెర్రీ ఫారడాక్స్ థీమ్‌’తో ఈ ఏడాది సమావేశమైన పలు దేశాల శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారితో సంబంధాన్ని పెంచుకునేందుకు సాంకేతిక పరిఙ్ఞానాన్ని మరింత ఉపయోగించాలని ఈ సందర్బంగా వారు అభిప్రాయపడ్డారు. అయితే గ్రహాంతరవాసులతో మాట్లాడేందుకు 1970 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో ఎరికిబో రేడియో టెలిస్కోప్‌ సహాయంతో అంతరిక్షంలోకి ఓ మెసేజ్‌ను శాస్త్రవేత్తలు పంపారు. అయితే దానికి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయినా ఏలియన్స్‌ స్పందన కోసం శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu