మొబైల్ పేమెంట్ యాప్‌లకు ఆర్బీఐ జరిమానా?

ఫోన్‌పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు జరిమానా విధించినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. జరిమానా పడిన వాటిలో వొడాఫోన్ ఎం-పేసా, మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ తదితర సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు ప్రమాణాలు పాటించని అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్‌పైనా ఆర్బీఐ కొరడా ఝళిపించింది. చెల్లింపులు, సెటిల్మెంట్స్ వ్యవస్థల చట్టం- 2007 కింద ఆయా సంస్థలకు ద్రవ్య పెనాల్టీ విధించినట్టు […]

మొబైల్ పేమెంట్ యాప్‌లకు ఆర్బీఐ జరిమానా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 04, 2019 | 5:11 PM

ఫోన్‌పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు జరిమానా విధించినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. జరిమానా పడిన వాటిలో వొడాఫోన్ ఎం-పేసా, మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ తదితర సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు ప్రమాణాలు పాటించని అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్‌పైనా ఆర్బీఐ కొరడా ఝళిపించింది. చెల్లింపులు, సెటిల్మెంట్స్ వ్యవస్థల చట్టం- 2007 కింద ఆయా సంస్థలకు ద్రవ్య పెనాల్టీ విధించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

వొడాఫోన్‌ ఎం-పేసాకు రూ.3.05 కోట్ల జరిమానా… మొబైల్ పేమెంట్స్, ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీలకు రూ.1 కోటి చొప్పున జరిమానా విధించారు. వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి కూడా రూ. 5 లక్షల మేర జరిమానా పడింది. కాగా వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్ సంస్థలకు వరుసగా రూ. 29.66 లక్షలు, రూ. 10.11 లక్షల మేర ఆర్బీఐ జరిమానా విధించింది.