పతంజలి పేరెత్తారో..: బాబా రాందేవ్

తాము నమోదు చేసుకున్న పతంజలి పేరును వాడొద్దంటూ చెన్నైలోని ఓ యోగా విద్యా, పరిశోధన సంస్థకు బాబా రాందేవ్ నోటీసులు పంపారు. దీన్ని ఉల్లంఘించడం 1999 పేటెంట్ చట్ట ప్రకారం నేరమని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే బాబా రాందేవ్, ఆయన స్నేహితుడు బాలకృష్ణ ఆచార్య ‘పతంజలి’ పేరుతో ఆయుర్వేద కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ బ్రాండ్ పేరుతో పలు వస్తువులను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఓ ఆడియో […]

పతంజలి పేరెత్తారో..: బాబా రాందేవ్
TV9 Telugu Digital Desk

| Edited By:

May 15, 2019 | 1:37 PM

తాము నమోదు చేసుకున్న పతంజలి పేరును వాడొద్దంటూ చెన్నైలోని ఓ యోగా విద్యా, పరిశోధన సంస్థకు బాబా రాందేవ్ నోటీసులు పంపారు. దీన్ని ఉల్లంఘించడం 1999 పేటెంట్ చట్ట ప్రకారం నేరమని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే బాబా రాందేవ్, ఆయన స్నేహితుడు బాలకృష్ణ ఆచార్య ‘పతంజలి’ పేరుతో ఆయుర్వేద కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ బ్రాండ్ పేరుతో పలు వస్తువులను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఓ ఆడియో సంస్థ పతంజలి యోగా సూత్రాల పేరుతో ఓ యాప్‌ను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై బాబా రాందేవ్ నోటీసులు పంపడం కలకలం రేపుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu