Super Star Rajinikanth: నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం… నేడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం..!
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని మీడియా బులిటెన్‌లో పేర్కొన్నారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని మీడియా బులిటెన్‌లో పేర్కొన్నారు. రజినీని నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి. కాగా, సూపర్ స్టార్ రజినీ డిసెంబర్ 25న హైబీపీ కారణంగా హైదరాబాద్‌లోని అపోలో చేరారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనడంతో అటు అభిమానులతో పాటు ఇటు సినీ ప్రముఖులు ఊపిరిపీల్చుకున్నారు.