AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొమ్మిదేళ్ల తర్వాత అక్కడ విడుదల కానున్న నాగ్ సినిమా.. క్రిస్మస్ కానుకగా విడుదలవుతోన్న చిత్రం.

నాగార్జున హీరోగా నటించిన రాజన్న చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు. తెలుగులో విడుదలైన దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రం తమిళంలో విడుదల కానుంది.

తొమ్మిదేళ్ల తర్వాత అక్కడ విడుదల కానున్న నాగ్ సినిమా.. క్రిస్మస్ కానుకగా విడుదలవుతోన్న చిత్రం.
Narender Vaitla
|

Updated on: Dec 21, 2020 | 9:34 PM

Share

rajanna releasing in tamil: నాగార్జున హీరోగా విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 2011లో వచ్చిన రాజన్న మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవ వీరుడిగా నాగ్ ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమిళంలో విడుదల కానుంది. రాజసింగమ్ పేరుతో లక్ష్మీ లోటస్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేశారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా గురించి నిర్మాత ఎస్‌జీఆర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలిపారు. చారిత్రక కథలతో నిర్మించే చిత్రాలు తమిళ నాట విజయవంతమవుతున్నాయని, ఆ కోవలోనే ఈ చిత్రం కూడా హిట్‌ అవుతుందని చెప్పుకొచ్చారు. మరి తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న రాజన్న తమిళంలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us
1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?
1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?
ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు!
ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు!
అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా?
అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా?
ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ..
ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ..
ఈడెన్ గార్డెన్స్‌లో పావెల్ విధ్వంసం.. లక్నో కు 182పరుగుల లక్ష్యం
ఈడెన్ గార్డెన్స్‌లో పావెల్ విధ్వంసం.. లక్నో కు 182పరుగుల లక్ష్యం
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్