అబ్బే.. అలాంటిదేం లేదే: వైసీపీ నేత రఘురాంకృష్ణంరాజు
తన ఇంట్లో ఎలాంటి సీబీఐ సోదాలు జరగలేదని వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురాంకృష్ణంరాజు అన్నారు. కేవలం స్టేట్‌మెంట్ రికార్డు కోసమే అధికారులు తన ఇంటికి వచ్చారని ఆయన తెలిపారు. పవర్ కార్పోరేషన్ బ్యాంకులో రుణం తీసుకున్నమాట నిజమేనని.. దానిని వన్‌టైమ్ సెటిల్మెంట్‌లో చెల్లిస్తానని చెప్పానని రఘురాంకృష్ణంరాజు పేర్కొన్నారు. కాగా బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో ఆయన ఇంటిపై ఈ ఉదయం సీబీఐ సోదాలు జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.