భర్తకు ఇష్టం లేని ఫ్యాషన్ షో.. భార్యపై కాల్పులు
తనకు ఇష్టం లేని ఫ్యాషన్ షోలో పాల్గొందని భార్యపై కాల్పులు జరిపాడు ఆమె భర్త. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని గుర్‌గ్రాంలో చోటుచేసుకుంది. ఇంద్రజీత్, ఆశారాణికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. ఆశారాణి స్టానికంగా ఉన్న పాఠశాలలో పనిచేస్తుంది. అయితే.. ఆమె పనిచేస్తోన్న పాఠశాలలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశారాణి పాల్గొనడానికి ఆసక్తి చూపింది. అయితే.. తన భార్య ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఇంద్రజీత్‌కు ఇష్టం […]

తనకు ఇష్టం లేని ఫ్యాషన్ షోలో పాల్గొందని భార్యపై కాల్పులు జరిపాడు ఆమె భర్త. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని గుర్‌గ్రాంలో చోటుచేసుకుంది. ఇంద్రజీత్, ఆశారాణికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. ఆశారాణి స్టానికంగా ఉన్న పాఠశాలలో పనిచేస్తుంది. అయితే.. ఆమె పనిచేస్తోన్న పాఠశాలలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశారాణి పాల్గొనడానికి ఆసక్తి చూపింది. అయితే.. తన భార్య ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఇంద్రజీత్‌కు ఇష్టం లేదు. భార్యకు చెప్పినా.. ఆమె పట్టించుకోలేదు. ఆవేశంతో ఊగిపోయిన ఇంద్రజీత్ పాఠశాలలో జరిగే ఫ్యాషన్ షో వద్దకు చేరుకుని ఆమెను ఇంటికి వెళ్దామని అడిగినా.. ఆమె తిరస్కరిండంతో అతని వద్ద గల గన్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు. కాల్పుల వల్ల తీవ్ర గాయాలైన ఆశారాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇంద్రజీత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.