మోదీపై 72 ఏళ్ళ బ్యాన్ బెస్ట్ : అఖిలేష్ యాదవ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాక్ మనీ బుద్దిని బయటపెట్టుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం ఆయనపై 72 గంటలు కాదు, 72 ఏళ్ళ పాటు నిషేధం విధించాలని ఎన్నికల సంఘాన్ని ‘డిమాండ్’ చేశారు. ‘అభివృద్ధి కావాలని మనం అడుగుతుంటే… ప్రధానమంత్రి శోచనీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో […]

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాక్ మనీ బుద్దిని బయటపెట్టుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం ఆయనపై 72 గంటలు కాదు, 72 ఏళ్ళ పాటు నిషేధం విధించాలని ఎన్నికల సంఘాన్ని ‘డిమాండ్’ చేశారు.
‘అభివృద్ధి కావాలని మనం అడుగుతుంటే… ప్రధానమంత్రి శోచనీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో విన్నారా? 125 కోట్ల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన మోదీ… విలువలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇది ఆయన బ్లాక్ మనీ మనస్తత్వానికి నిదర్శనం’ అంటూ అఖిలేష్ ట్వీట్ చేసి ప్రధానిపై నిప్పులు కక్కారు.
‘विकास’ पूछ रहा है: प्रधान जी का शर्मनाक भाषण सुना क्या? “सवा सौ करोड़” देशवासियों का भरोसा खोकर अब वो बंगाल के 40 विधायकों के तथाकथित दल-बदल के अनैतिक भरोसे तक सिमट गये हैं. ये वो नहीं काले धन की मानसिकता बोल रही है.
इसके लिए उन पर 72 घंटे नहीं बल्कि 72 साल का बैन लगना चाहिए. pic.twitter.com/H504UdfWGo
— Akhilesh Yadav (@yadavakhilesh) April 30, 2019