మనీ ప్లాంట్ మొక్క ఇంటిలో సంపదకు చిహ్నం. ఇది ఎవరి ఇంటిలో ఉంటే, వారి ఇంట ధనం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి జరుగుతుంది అంటారు.
అందుకే చాలా మంది మనీ ప్లాంట్ మొక్కను తమ ఇంటిలో నాటుకుంటారు. అయితే చాలా మంది ఈ మొక్కను లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లో పెడుతుంటారు.
అంతే కాకుండా తెలిసి తెలియక, తప్పుడు దిశలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. కానీ అలా చేయడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ అనేది శుక్రగ్రహానికి సంబంధించినది అందువలన ఎప్పుడూ కూడా దీనిని ఆగ్రేయం దిశలో పెట్టడం చాలా మంచిదంట.
అంతే కాకుండా కొంత మంది కుండీలో నాటితే మరికొంత మంది నీటిలో పెడుతుంటారు. అయితే ఎందులో పెట్టినా మంచిదే అయినప్పటికీ వీటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట.
వీలైనంత వరకు మనీ ప్లాంట్ మొక్కకు మురికి నీరు పోయకూడదంట. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి, ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయి.
ముఖ్యంగా ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను ముళ్ల మొక్కల వద్ద పెంచకూడదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
ముళ్ల మొక్కల వద్ద మనీ ప్లాంట్ మొక్కను పెంచడం వలన ఇది ఇంటిలో ఆర్థిక సమస్యలకు, కలహాలకు కారణం అవుతుందంట.