గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సీఎం కార్యాలయ ఓఎస్డి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ ఇచ్చిన ఛాలెంజ్...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన సీఎం కార్యాలయ ఓఎస్డి ప్రియాంక వర్గీస్ దూలపల్లి లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమం 23 శాతం నుండి 33 శాతానికి అడవులు పెంచాలన్న లక్ష్యంతో నడుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఈ లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకుంటుందని, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దీనికి తోడు అవుతుందని వివరించారు. ఈ ఛాలెంజ్ వలన ప్రజలలో చైతన్యం కలుగుతుందని తెలిపారు.
Thank you #PriyankaVarghese IFS garu for accepting #GreenIndiaChallenge and planting saplings. Your efforts in making #Telangana ku #HarithaHaaram, the brain child of our Honble CM #KCR garu, known to all. Your participation in #GIC would certainly boost up the initiative. pic.twitter.com/NErGmEAoRO
— Santosh Kumar J (@MPsantoshtrs) October 16, 2020