అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన అనిత అనే గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన ఆమెకు బుధవారం ఉదయం డెలివరీ చేయాల్సి ఉండగా.. మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి బంధువుల ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.. బాధితులకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణి.. ఈ నెల 10వ తేదీన కాన్పు కోసం సంగారెడ్డి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఈరోజు ఉదయం ఆమెకు డెలివరీ చేయాల్సి ఉండగా.. అనిత మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వారు బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. పెద్ద ఎత్తున ఆస్పత్రి దగ్గరకు చేరుకుని.. వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడం, వారి నిర్లక్ష్యం కారణంగానే అనిత ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు.
బాధితుల ఆందోళనతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు సమాచారం..
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
