ఆలయాలపై దాడులు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి, అనంతపురం పర్యటనలో చిన్న జీయర్ స్వామి

ఆలయాలపై దాడులు జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్..

  • Venkata Narayana
  • Publish Date - 3:42 pm, Sat, 23 January 21
ఆలయాలపై దాడులు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి, అనంతపురం పర్యటనలో చిన్న జీయర్ స్వామి

ఆలయాలపై దాడులు జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల సందర్శనలో భాగంగా ఆయన, శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆలయాల్లో విధులు సరిగా నిర్వర్తించే టీంలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దాడులు జరగక ముందే తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అందుకే గ్రామాల్లో పర్యటించి.. స్థానికులతో సమావేశమవుతున్నామని, ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటన పూర్తైందని చిన్న జీయర్ స్వామి వెల్లడించారు. అనంతపురం పర్యటన అనంతరం చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తామని చిన్న జీయర్ స్వామి తెలిపారు. ఆలయాలపై దాడుల నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఏపీ పర్యటన షురూ.. ఈ నెల 28 వరకు 5 జిల్లాల్లో యాత్రఆలయం మనిషికి నైతికశక్తినిచ్చే సాధనం, సమాజ రక్షణకు మార్గం, మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చే నిలయం : చిన్న జీయర్ స్వామి