వకీల్ సాబ్ నుంచి న్యూ స్టిల్ లీక్.. నల్లకోటులో పవన్..
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీలో పెద్ద విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బోని కపూర్, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రెండున్నర ఏళ్ల తరువాత టాలీవుడ్‌కి రీఎంట్రీ..
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీలో పెద్ద విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బోని కపూర్, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రెండున్నర ఏళ్ల తరువాత టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారు పవన్. అసలు ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ షూటింగ్‌కి వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృంబం భావిస్తోంది.
కాగా ఈ నేపథ్యంలో వకీల్ సాబ్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇందులో పవన్ లాయర్ లుక్‌లో కనిపించారు. కోర్టులో నల్ల కోటు ధరించి వాదనలు వినిపిస్తున్న సన్నివేశానికి సంబంధించి ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో నటి అంజలి కూడా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పవన్ లుక్ మినహా పాత్రలను పరిచయం చేయలేదు. తాజాగా ఫొటో లీక్‌తో ఇందులో అంజలి నటిస్తున్నారని అర్థమవుతోంది.
Read More:
బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..