Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. అయితే ఆ కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే...
YCP Leader Moka Bhaskar Rao Assassination in Krishna District, బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్‌ రావుని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం చేపల మార్కెట్‌కి వెళ్లిన మోకా భాస్కర్‌ రావుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. అయితే ఆ కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష స్యాక్షులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన్ని హత మార్చారని మోకా భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వైసీపీ నేత భాస్కర రావు హత్య కేసులో కీలక ఆధారాలు గుర్తించారు పోలీసులు. వైసీపీ నేత హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భాస్కరరావును హత్య చేసేందుకు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కత్తితో హత్య చేసిన వ్యక్తిని చింత పులిగా గుర్తించాం. హత్య చేసి అనంతరం బైక్‌పై ఎక్కించికెళ్లిన మరో నిందితుడు చింత చిన్ని. హత్యపై పొలిటికల్ వార్ వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం 4 పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

YCP Leader Moka Bhaskar Rao Assassination in Krishna District, బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

Read More: 

కరోనా రక్కసికి మరొకరు బలి.. పిఠాపురంలో తొలి కోవిడ్ మరణం..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..

Related Tags