రైతుకు-వినియోగదారుడికి వారధిలా తపాలా శాఖ..క్రేజీ ఐడియా
ట్విన్ సిటీస్ లో తెలంగాణాలోని తపాలాశాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుకు-వినియోగదారుడికి వారధి పాత్ర పోషిస్తుంది. మాములుగా ఉత్తరాలు పంచే ఉద్యోగులు… ప్రజంట్ మామిడి పండ్లను చేరవేస్తున్నారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ తపాలా సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకటరెడ్డిలు సంయుక్తంగా మామిడి పండ్లను తపాలాశాఖ ద్వారా పంపించే కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటిరోజే తపాలాశాఖకు చెందిన వాహనాల ద్వారా 2,180 కిలోల […]

ట్విన్ సిటీస్ లో తెలంగాణాలోని తపాలాశాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుకు-వినియోగదారుడికి వారధి పాత్ర పోషిస్తుంది. మాములుగా ఉత్తరాలు పంచే ఉద్యోగులు… ప్రజంట్ మామిడి పండ్లను చేరవేస్తున్నారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ తపాలా సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకటరెడ్డిలు సంయుక్తంగా మామిడి పండ్లను తపాలాశాఖ ద్వారా పంపించే కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మొదటిరోజే తపాలాశాఖకు చెందిన వాహనాల ద్వారా 2,180 కిలోల మామిడి పండ్లను గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తపాలాశాఖ అందజేసింది. మొత్తం 436 బాక్సులు ఇళ్లకు చేరగా.. మియాపూర్ పరిసరాల్లో ఎక్కువ హోమ్ డెలివరీలు చేశారు. తర్వాత స్థానంలో గోల్కొండ, బేగంపేట ప్రాంతాలు ఉన్నాయి. మామిడిపండ్లు కావాలనుకునేవారు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 79977 24925, 79977 24941 నంబర్లను సంప్రదించవచ్చు.