ఫొటోతో సీన్ లోకి దిగిపోయిన నిర్మల, ‘ఎమ్మెల్యే వెలగపూడీ.. నీ ఇంటికొచ్చా.. బయటకు రా.. నీ నట్టింట్లోకొస్తా’నంటూ తిష్ట
సాగరనగరం విశాఖలో రాజకీయ సునామీ చెలరేగింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రోజు రోజుకు హీటెక్కుతోంది. ప్రమాణం నీదా? నాదా అంటూ...
సాగరనగరం విశాఖలో రాజకీయ సునామీ చెలరేగింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రోజు రోజుకు హీటెక్కుతోంది. ప్రమాణం నీదా? నాదా అంటూ సవాళు విసురుకుంటున్నారు నేతలు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తూ.. విజయసాయి రెడ్డి ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ప్రమాణానికి విజయసాయిరెడ్డి అవసరం లేదు.. తాను సిద్ధమంటూ వెలగపూడికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అక్కరమాని విజయనిర్మల. అంతేకాదు, నేరుగా ఈ ఉదయాన్నే సీన్ లోకి దిగిపోయారు. ప్రమాణం నీవు చేస్తావా.. నన్ను చేయమంటావా అంటూ.. దేవుడి ఫొటో పట్టుకుని కొంచెంసేపటిక్రితం వెలగపూడి ఆఫీస్‌కు వచ్చేశారామె. ఈ క్రమంలో వెలగపూడి రామకృష్ణ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సాగరనగరం ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెలగపూడి నివాసానికి అక్కరమాని నిర్మల చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వెలగపూడి నివాసానికి 5 వందల మీటర్ల దూరం వరకూ పోలీసులు మోహరించారు. ముందుకువెళ్లకుండా నిర్మలను రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అవినీతి చేయకపోతే వెలగపూడి బయటకు రావాలంటూ నిర్మల నినాదాలు చేశారు. 11 గంటలకు సమయమిచ్చి వెలగపూడి బయటకు రాలేదంటూ నిర్మల ఎద్దేవా చేశారు.