27న ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న (సోమవారం) సీఎంలతో కరోనా వైరస్ ప్రభావం, అన్ లాక్ 3.0 గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ఆరోగ్య సేవలు, వ్యుహాలపై ముఖ్యమంత్రులతో మోడీ డిస్కస్ చేయనున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలతో వరసగా సమావేశమవుతూ వస్తున్నారు ప్రధాని. కరోనా […]

దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న (సోమవారం) సీఎంలతో కరోనా వైరస్ ప్రభావం, అన్ లాక్ 3.0 గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ఆరోగ్య సేవలు, వ్యుహాలపై ముఖ్యమంత్రులతో మోడీ డిస్కస్ చేయనున్నారు.
లాక్ డౌన్ ప్రారంభం నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలతో వరసగా సమావేశమవుతూ వస్తున్నారు ప్రధాని. కరోనా మహమ్మరి కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్దేశం చేస్తున్నారు. మార్చి 23వ తేదీన మొదటిసారి లాక్ డౌన్ విధించే ముందు సీఎంలతో సమావేశమయ్యారు. తర్వాత దశలవారీగా అభిప్రాయం తీసుకున్నారు. లాక్ డౌన్ 4.0 ముగిసేలోపు మే నెల చివరివారంలో అమిత్ షా కూడా సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. కేసులు పెరుగుతున్న ఈ సమయంలో సీఎంలతో మోడీ ఇంటరాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది.




