‘దిల్ బేచారా’ ఖాతాలో మరో రికార్డు.. భారతీయ సినిమాల్లోనే మొదటి స్థానం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా'. శుక్రవారం ఆన్‌లైన్‌లో ఈ చిత్రం విడుదలైంది. సుశాంత్ ఙ్ఞాపకార్థం ఈ సినిమాను అందరికీ ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది హాట్‌స్టార్+డిస్నీ

Sushant Singh Dil Bechara: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’. శుక్రవారం ఆన్‌లైన్‌లో ఈ చిత్రం విడుదలైంది. సుశాంత్ ఙ్ఞాపకార్థం ఈ సినిమాను అందరికీ ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది హాట్‌స్టార్+డిస్నీ. ఇక ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న అభిమానులు సినిమాను చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమాలో సైతం సుశాంత్ చనిపోయే సన్నివేశం ఉండటంతో.. వారు మరింత ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మోస్ట్ లైక్డ్‌గా ట్రైలర్‌గా దిల్ బేచారే రికార్డులకెక్కగా.. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఐఎంబీడీలో 20వేలపైగా ఓట్లతో 9.8 రేటింగ్‌ను సాధించింది దిల్ బేచారే. దీంతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఐఎంబీడీ రేటింగ్ సాధించిన చిత్రంగా దిల్ బేచారే రికార్డులకెక్కింది.
కాగా ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే హాలీవుడ్ నవల ఆధారంగా దిల్ బేచారా తెరకెక్కింది. ఇందులో సుశాంత్ సరసన సంజనా సంఘీ నటించగా.. సైఫ్ అలీ ఖాన్, స్వస్తా ఛటర్జీ, స్వస్తిక్ ముఖర్జీ, సాహిల్ వాయిద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖేష్ చాబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.



