బిగ్‌బాస్‌ 4: ఈ ఇద్దరు సింగర్లు కన్ఫర్మ్..!

కరోనా నేపథ్యంలో ఈసారి బిగ్‌బాస్ ఉంటుందా..? లేదా..? అన్న ప్రశ్న మొన్నటివరకు అందరిలో మెదిలింది. అయితే వాటన్నింటికి బ్రేక్ వేస్తూ 'బిగ్‌బాస్‌ 4' ప్రోమోను ఇటీవల విడుదల చేశారు నిర్వాహకులు.

బిగ్‌బాస్‌ 4: ఈ ఇద్దరు సింగర్లు కన్ఫర్మ్..!
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 10:46 AM

కరోనా నేపథ్యంలో ఈసారి బిగ్‌బాస్ ఉంటుందా..? లేదా..? అన్న ప్రశ్న మొన్నటివరకు అందరిలో మెదిలింది. అయితే వాటన్నింటికి బ్రేక్ వేస్తూ ‘బిగ్‌బాస్‌ 4’ ప్రోమోను ఇటీవల విడుదల చేశారు నిర్వాహకులు. దీంతో బిగ్‌బాస్‌పై అందరి అనుమానాలు తీరాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఎవరెవరు కంటెస్టెంట్‌లుగా రాబోతున్నారన్న ఆసక్తి ఇప్పుడు వీక్షకుల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో శ్రద్దా దాస్‌, యామిని భాస్కర్‌, హంసా నందిని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ కూడా బిగ్‌బాస్‌ 4లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరితో పాటు రాప్ సింగర్‌ నోయల్ సేన్‌, ఫోక్‌ సింగర్(సత్య రాథోడ్)‌ మంగ్లీ ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సీజన్‌కి కూడా నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు.