తెలుగు విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోను సూద్

వలస కూలీల పాలిట దేవుడిగా పేరున్న సోనూ సూద్.. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి రియల్ హీరోగా మారారు. లాక్‌డౌన్‌తో కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు...

  • Sanjay Kasula
  • Publish Date - 9:36 am, Sat, 25 July 20
తెలుగు విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోను సూద్

లాక్‌డౌన్‌తో కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు దేవుడిగా మారాడు రియల్ హీరో సోను సూద్. వలస కూలీల పాలిట దేవుడిగా పేరున్న సోనూ సూద్.. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి రియల్ హీరోగా మారారు. లాక్‌డౌన్‌తో కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు విశాఖకు చేరుకున్నారు.

కళాశాలలు మూతపడి నాలుగు నెలలైనా స్వ దేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కేక్‌లోని నాలుగు మెడికల్‌ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో భయం భయంగా అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా వందల మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే కొన్ని కారణాలతో అక్కడే చిక్కుకున్న మరికొంత మంది తెలుగు విద్యార్థులు.. సోషల్ మీడియా ద్వారా సోను సూద్‌కు తమ కష్టాలను చెప్పుకున్నారు.

దీంతో అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా వారికి విమాన టికెట్ ధరను కూడా తగ్గించి మొత్తం 176 మంది విద్యార్థులను విశాఖకు తీసుకొచ్చారు. విశాఖకు చేరుకున్న విద్యార్థులు సోను సూద్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.