AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గద్వాల జిల్లాలో ప్రమాదం.. వాగులో కొట్టుక పోయిన కారు

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గ‌ద్వాల‌ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. క‌లుగొట్ల వాగు స‌మీపంలోవద్ద వాగు..

గద్వాల జిల్లాలో ప్రమాదం.. వాగులో కొట్టుక పోయిన కారు
Sanjay Kasula
|

Updated on: Jul 25, 2020 | 8:50 AM

Share

వ‌ర్షాలు దంచికొడుతుండ‌డంతో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి.. ఇదే స‌మ‌యంలో వాగు దాటుతున్న ఓ కారు వ‌ర‌ద ఉధృతికి కొట్టుకుపోయింది. అయితే. కారులో ఉన్న ముగ్గురిలో.. ఇద్దరు ప్రయాణికులు సుర‌క్షితంగా బయటపడగా.. మరొకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గ‌ద్వాల‌ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. క‌లుగొట్ల వాగు స‌మీపంలోవద్ద వాగు ఉప్పొంగింది.  ఇది గమనించని డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న శ‌నివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

బెంగళూరులో ఉంటున్న శివ‌కుమార్ రెడ్డి త‌న భార్య సింధూ రెడ్డి, మరో మిత్రుడు జిలానీ బాషాతో క‌లిసి హైద‌రాబాద్‌కు శుక్ర‌వారం రాత్రి బ‌య‌ల్దేరారు.  శ‌నివారం తెల్ల‌వారుజామున 6:30 గంట‌ల స‌మ‌యంలో.. పుల్లూరు మీదుగా హైవే ఎక్కేందుకు క‌లుగొట్ల వాగు వైపు వెళ్లారు. అక్క‌డ వ‌ర‌ద ఉధృతి ఎక్కువ ఉండ‌టంతో.. కారు కొట్టుకుపోయింది. ఈ ప్ర‌మాదం నుంచి శివ‌కుమార్ రెడ్డి, జిలానీ బాషా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే శివకుమార్ రెడ్డి భార్య సింధూ రెడ్డి వ‌ర‌ద నీటిలో గ‌ల్ల‌తైంది. వెంటనే సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు.

Follow Us
ఆసియా పవర్ ఇండెక్స్: మూడో స్థానంలో భారత్.. మోదీకి రెండో ర్యాంక్!
ఆసియా పవర్ ఇండెక్స్: మూడో స్థానంలో భారత్.. మోదీకి రెండో ర్యాంక్!
డ్రాతో భగ్గుమన్న గిల్.. ఆ ఐసీసీ రూల్‌పై షాకింగ్ కామెంట్స్..!
డ్రాతో భగ్గుమన్న గిల్.. ఆ ఐసీసీ రూల్‌పై షాకింగ్ కామెంట్స్..!
ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇదే కరెక్ట్‌ టైమ్‌..ఆరోగ్య ప్రయోజనాలు!
క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇదే కరెక్ట్‌ టైమ్‌..ఆరోగ్య ప్రయోజనాలు!
ఆమె నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా..
ఆమె నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా..
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో 29 ఏళ్ల స్టార్.. టీమిండియా నుంచి ఔట్..!
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో 29 ఏళ్ల స్టార్.. టీమిండియా నుంచి ఔట్..!
చుక్క నీరు లేకుండా చిక్కటి గ్రేవీతో అదిరిపోయే చికెన్ కర్రీ
చుక్క నీరు లేకుండా చిక్కటి గ్రేవీతో అదిరిపోయే చికెన్ కర్రీ
ఆ ఒక్క సినిమాతో మా ఆస్తులన్నీ పోయాయి..
ఆ ఒక్క సినిమాతో మా ఆస్తులన్నీ పోయాయి..
వడలు నూనె పీల్చకుండా హోటల్ స్టైల్‌లో రావాలంటే ఇలా చేయండి..
వడలు నూనె పీల్చకుండా హోటల్ స్టైల్‌లో రావాలంటే ఇలా చేయండి..
మూడు చప్పరించి తింటే.. పరిగెత్తించి మరీ ఆ వ్యాధులను తరిమేస్తుంది
మూడు చప్పరించి తింటే.. పరిగెత్తించి మరీ ఆ వ్యాధులను తరిమేస్తుంది