విజయవాడ ఘటనపై.. జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్!

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అద్దెకు తీసుకుంది.

  • Tv9 Telugu
  • Publish Date - 10:47 am, Sun, 9 August 20
విజయవాడ ఘటనపై.. జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్!

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్యాలెస్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అద్దెకు తీసుకుంది. దీనిని కరోనా రోగుల కేర్‌ సెంటర్‌గా ఉపయోగిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రధాని సీఎం జగన్ తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని తెలిపారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!