రక్షణ తయారీ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి

‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

రక్షణ తయారీ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి
Follow us

|

Updated on: Aug 27, 2020 | 7:10 PM

‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత దేశంలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను పెంచడమే తమ లక్ష్యమని ప్రధాని అన్నారు. మిత్ర దేశాలకు నమ్మకమైన ఆయుధాలను సరఫరా చేయడంలో భారత దేశము ముందు వరుసలో ఉందన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ వెబినార్‌లో మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. అనేక సంవత్సరాల నుంచి మన దేశం అతి పెద్ద రక్షణ రంగ ఉత్పత్తుల దిగుమతిదారుగా ఉంటోందన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌ సామర్థ్యం గొప్పగా ఉండేదన్నారు. దురదృష్టవశాత్తూ ఈ విషయం తగిన విధంగా దృష్టిని ఆకర్షించలేదన్నారు. మన దేశంలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ “ప్రపంచానికి మంచి మార్గంలో తోడ్పడటానికి మేము స్వావలంబన పొందాలనుకుంటున్నామన్నారు. ఈ దిశలో 101 రక్షణ వస్తువుల దిగుమతిపై నిషేధం ఎత్తివేస్తూ విధాన సంస్కరణలు తీసుకున్నామని రాజ్‌నాథ్ తెలిపారు.