ఈ నెల 15న సీఎంలతో ప్రధాని భేటీ
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 15వ తేదీన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, లెఫ్టెనెంట్ గవర్నర్లు కూడా హాజరవుతారు. వీరందరూ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు. ప్రధానిగా రెండోసారి ప్రమాణం చేసిన తరువాత మోడీ తొలిసారి ఈ స్థాయి సమావేశం జరుగనుంది. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి… ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ను తెచ్చారు మోడీ. ఈ […]
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 15వ తేదీన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, లెఫ్టెనెంట్ గవర్నర్లు కూడా హాజరవుతారు. వీరందరూ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు. ప్రధానిగా రెండోసారి ప్రమాణం చేసిన తరువాత మోడీ తొలిసారి ఈ స్థాయి సమావేశం జరుగనుంది. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి… ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ను తెచ్చారు మోడీ. ఈ సంస్థకు ఛైర్మన్ ప్రధానమంత్రే. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ నాలుగు సార్లు భేటీ అయింది. అయిదోసారి ఈనెల 15న భేటీ అవుతోంది.