మోదీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. బిల్ గేట్స్ చేతుల మీదుగా..

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డును అందుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన యుఎన్ సర్వసభ్య సమావేశంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీకి ఈ అవార్డును అందజేశారు. బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ అవార్డు పేదరికాన్ని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను ఒకేచోట చేర్చాలని ప్రయత్నిస్తోందని బిల్ గేట్స్ అన్నారు. మహాత్మాగాందీ 150వ జయంతి సందర్భంగా […]

మోదీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. బిల్ గేట్స్ చేతుల మీదుగా..
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2019 | 8:44 AM

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డును అందుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన యుఎన్ సర్వసభ్య సమావేశంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీకి ఈ అవార్డును అందజేశారు. బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించిన గోల్ కీపర్స్ అవార్డు పేదరికాన్ని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను ఒకేచోట చేర్చాలని ప్రయత్నిస్తోందని బిల్ గేట్స్ అన్నారు.

మహాత్మాగాందీ 150వ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఘన, ద్రవ్య వ్యర్థ పదార్థాలను వేరు పరచడం ద్వారా గ్రామాలను శుభ్రపరచడమే కాకుండా.. గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా చేయాలని ఈ మిషన్‌ను ప్రారంభించారు. పరిశుభ్రత కోసం గాంధీజీ కల ఇప్పుడు నిజమైందని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రచారం ద్వారా దాదాపు రూ.3 లక్షల మంది వ్యాధుల నుంచి రక్షించబడ్డారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ సహా పలువురు హాజరయ్యారు.